వైభవంగా నిడిమామిడమ్మ దేవత ప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

వైభవంగా నిడిమామిడమ్మ దేవత ప్రతిష్ట

Mar 11 2026 8:36 AM | Updated on Mar 11 2026 8:36 AM

పుట్టపర్తి అర్బన్‌: భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న నిడిమామిడమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు మంగళవారం వైభవంగా జరిగాయి. పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంలో రూ.లక్షల వ్యయంతో ఇటీవల నూతన ఆలయాన్ని నిర్మించారు. మూడు రోజులుగా సాగుతున్న ప్రతిష్టాపన ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పూజల్లో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ దంపతులు, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, వైస్‌ ఎంపీపీ రంగన్న, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీనరసమ్మ, మున్సిపల్‌ చైర్మన్‌ తుంగ ఓబుళపతి, కో–ఆప్షన్‌ సభ్యుడు మాబూసాహెబ్‌, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెనికాని గంగాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి అవుటాల రమణారెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్‌ రవినాయక్‌, సొసైటీ మాజీ అధ్యక్షురాలు ఉషారాణి, మాధవరెడ్డి, సర్పంచ్‌ బాలు, నంజిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement