హిందూపురం: ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ మినీ సబ్ జూనియర్ టోర్నమెంట్‌లో పాల్గొనే జిల్లా రగ్బీ జట్లను బుధవారం ఎంపిక చేశారు. ఏపీ రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి కే.యాసిన్ మాలిక్ తెలిపారు. అండర్ 12 బాలుర జట్టులో అకిరా నందన్, వెంకట్ జ్ఞానదీప్ కార్తీక్ వర్మ, ప్రణయ్, సోమనాథ్ నాయక్, మహమ్మద్, అద్దం మారుతి, అచ్యుత్ కుమార్, గనగిరి, లోకేశ్వర్, హరి స్థానం దక్కించుకున్నారు. అలాగే బాలికల జట్టులో పల్లవి, లక్ష్మి, కీర్తి, నిత్యప్రియ, స్వప్నప్రియ, శాలిని, నిదర్శిని, జయశ్రీ, దీక్షిత, నవ్య, విజయ, లలిత ఎంపికై నట్లు రగ్బీ అసోసియేషన్ వెల్లడించింది. ఈ జట్లు ఈనెల 8వ తేదీ నుంచి విజయవాడ గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే 3వ ఏపీ ఇంటర్ డిస్టిక్ మినీ సబ్ జూనియర్ బాల బాలికల టోర్నమెంట్‌లో పాల్గొంటాయని చెప్పారు.


