బాల్య వివాహానికి బ్రేక్
పుట్టపర్తి అర్బన్: గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లిలో ఓ బాల్య వివాహానికి అధికారులు బ్రేక్ వేశారు. మైనార్టీ కూడా తీరని బాలికకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. రెండు రోజుల్లో పెళ్లి ఉండగా...ఈ విషయం అధికారులకు తెలిసింది. దీంతో శుక్రవారం ఎంపీడీఓ ప్రమీల భాయి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగరాణి గుమ్మయ్యగారిపల్లి ఎస్సీ కాలనీకి వెళ్లి బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం కలిగే అనర్థాలను వివరించి పెళ్లి నిలుపుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాలికకు పెళ్లి చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు వారు సూచించారు.
తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చిన
అధికారులు


