అరటి ధరల పతనం రైతులను అల్లకల్లోలం చేస్తోంది. గత ఏడాది న
● అరటి రైతుల ఆక్రందన
● వారం కిందట టన్ను రూ.25వేలు
● నేడు రూ.15వేలకు పడిపోయిన వైనం
మూడో పంట కింద పండిన అరటిని
కొనేవారు లేకపోవడంతో పెద్దపప్పూరు
మండలం గార్లదిన్నె గ్రామానికి చెందిన
ఓ రైతు జీవాల కాపరులకు వదిలేశాడు.
దీంతో కాపరులు అరటి గెలలను కోసుకుని ఎద్దులబండిలో తీసుకెళుతున్న దృశ్యమిది.
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 40 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో అరటి సాగు చేశారు. డిసెంబర్ 15 నుంచి మొదటి పంట కోతలు మొదలయ్యాయి. జనవరిలో టన్ను రూ.15 వేలతో మొదలైన ధర ఫిబ్రవరి 20 నాటికి ఏకంగా రూ.25 వేలకు చేరుకోవడంతో తమ పంట పండినట్లేనని రైతులు ఆనందపడ్డారు. గత అక్టోబర్, నవంబర్‌లో వచ్చిన నష్టాలు పూడ్చుకోవచ్చని భావించారు. అప్పట్లో ధర దారుణంగా పడిపోవడంతో అరటి తోటలను జీవాలకు వదిలేయడం, అర్ధంతరంగా దున్నేయడం చేశారు. ఫిబ్రవరి మొదటి నుంచి టన్ను రూ.20 వేల నుంచి రూ.26 వేల వరకు నడిచినట్లు రైతులు చెబుతున్నారు. అయితే రెండు రోజులుగా ధర తగ్గుముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్నారు. వారం కిందట వరకు రూ.25 వేలు ఉన్న ధర నాలుగు రోజుల కిందట రూ.20 వేలకు, రెండు రోజలుగా మరింత పతనమై రూ.15 వేలకు పడిపోయింది. టన్ను మీద ఏకంగా రూ.10 వేలు తగ్గిపోవడంపై రైతులు బెంబేలెత్తిపోతున్నారు.
● పంట దాదాపు చేతికి రావడం, ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, మరోపక్క వాతావరణ మార్పులతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని భయపడుతున్న రైతులు పంట కోతలకు ఆసక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు, దళారులు, ఏజెంట్లు ధరలు తగ్గించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఇదే పరిస్థితి ఉంటే భారీ నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తమవుతోంది. రంజాన్ మాసం, హోలీ పండుగ ఉండటం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు, రవాణా తగ్గడం, దాదాపు ఉత్తరాది వాళ్లే కూలీలుగా ఉండటం వల్ల లోడింగ్‌కు రాకపోవడంతో ధరలు తగ్గడానికి కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 32 మండలాల్లోనూ గ్రాండ్ నైన్ రకం టిష్యూకల్చర్ అరటి సాగు చేశారు. ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇందులో అత్యధికంగా పుట్లూరు మండలంలో 6,985 ఎకరాలు, యల్లనూరులో 5,777, నార్పలలో 5,357, పెద్దపప్పూరులో 4,267, యాడికిలో 2,833, బుక్కరాయసముద్రంలో 1,920, బెళుగుప్పలో 1,920, కళ్యాణదుర్గంలో 1,814, రాప్తాడులో 1,803, అనంతపురం రూరల్‌లో 1,090 ఎకరాల్లో సాగైంది. ఈ–క్రాప్ నివేదిక ప్రకారం 13 వేల మంది వరకు రైతులు 39 వేల ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో పంట సాగు చేశారు. అటు శ్రీసత్యసాయి జిల్లాలో కూడా 1600 మంది వరకు రైతులు 3వేల ఎకరాల్లో అరటి సాగు చేశారు. ఎకరాకు 22 నుంచి 25 టన్నుల వరకు దిగుబడి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 9 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా అరటి ఫలసాయం అంచనా వేశారు.
అరటి ధరల పతనం రైతులను అల్లకల్లోలం చేస్తోంది. గత ఏడాది న
అరటి ధరల పతనం రైతులను అల్లకల్లోలం చేస్తోంది. గత ఏడాది న


