
సర్వే పకడ్బందీగా చేపట్టాలి
చెన్నేకొత్తపల్లి: గ్రామ కంఠం, ఇంటి స్థలాలకు యాజమాన్య హక్కు కల్పించేందుకు చేపట్టిన సర్వే పకడ్బందీగా నిర్వహించాలని డీపీఓ సమత సిబ్బందికి సూచించారు. న్యామద్దెల పంచాయతీ హరియాన్‌చెరువు గ్రామంలో జరుగుతున్న సర్వేను శనివారం ఆమె పరిశీలించారు. సర్వే త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ హేమంత్, వెంకటేష్, గ్రామ సర్వేయర్ వినోద్ పాల్గొన్నారు.
సచివాలయం తనిఖీ : చెన్నేకొత్తపల్లి సచివాలయం–1ను డీపీఓ సమత ఇన్‌చార్జ్ ఎంపీడీఓ అశోక్‌నాయక్‌తో కలసి తనిఖీ చేశారు. కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. పన్నులు, పారిశుధ్యం, ఇంటింటి చెత్త సేకరణ తదితర పనుల గురించి పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో దోమలు పెరిగి జ్వరాలు పెరిగే ప్రమాదం ఉందని, కావున ప్రత్యేక శ్రద్ద చూపాలని సిబ్బందికి సూచించారు.