
అలరించిన సాంస్కృతిక వైభవం
ప్రశాంతి నిలయం: భగవాన్ సత్యసాయిబాబా ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ.. మానవతా విలువలు వివరిస్తూ సాయి విద్యాసంస్థల చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్త కోటిని పరవశభరితులను చేశాయి. దేశ వ్యాప్తంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, సత్యసాయి సేవా సంస్థల నేతృత్వంలో నిర్వహిస్తున్న 103 పాఠశాలలకు చెందిన 2,400 మంది విద్యార్థులు ప్రశాంతి నిలయానికి తరలివచ్చి సత్యసాయి మహాసమాధి చెంత శ్రీసత్యసాయి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో కృతజ్ఞతా పూర్వక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి గురుకులం బెజ్జంకి, శ్రీసత్యసాయి విద్యా విహార్ విశాఖపట్నంకు చెందిన విద్యార్థులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సూరత్‌కు చెందిన శ్రీసత్యసాయి స్కూల్ విద్యార్థులు గరాబ్ నృత్యం ప్రదర్శించారు. హర్యానాకు చెందిన శ్రీసత్యసాయి జాగృతి విద్యా మందిరం విద్యార్థులు బాంగ్రా నృత్య ప్రదర్శన ఇచ్చారు. సాయంత్రం ఒడిశాలోని పార్లాక్కెముండి గజపతి జిల్లాకు చెందిన శ్రీసత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.

అలరించిన సాంస్కృతిక వైభవం