
తప్పనిసరిగా హాజరు కావాలి
గోరంట్ల: గోరంట్ల బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న క్లస్టర్ల కాంప్లెక్స్ సమావేశాలను శనివారం డీఈఓ కిష్టప్ప పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఉపాధ్యాయులు తప్పకుండా హాజరై అన్ని విషయాలు చర్చించి పాఠశాలలో విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ఉపాధ్యాయులు సెలవు పెట్టుకోకూదన్నారు. టీచర్ డైరీ అసైన్మెంట్ బుక్‌లెట్‌లను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. వెనుకబడిన పిల్లలకు రెమిడియల్ క్లాసెస్ నిర్వహించి వారిన తరువాత జరిగే పరీక్షలకు సమాయాత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓలు రెడ్డెప్పతోపాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.