ధర్మవరం అర్బన్: ఈవీఎంల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. శుక్రవారం ధర్మవరంలోని మార్కెట్‌యార్డు గోదాములో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ఫైర్ సేఫ్టీ, 24గంటల భద్రతాపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ సురేష్‌బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్న పీఈటీలు
లేపాక్షి: మండలంలోని పులమతి జెడ్పీహెచ్‌ఎస్ వ్యాయామ ఉపాధ్యాయుడు సురేష్‌బాబుతో పాటు గతంలో పనిచేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు రామాంజనేయులు శుక్రవారం ఎక్స్‌లెన్సీ అవార్డును అందుకున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి అవార్డులను జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ అందజేశారు.
నూతన బార్లకు నేడు లాటరీ
పుట్టపర్తి టౌన్: జిల్లాలో నూతన బార్ల ఏర్పాటుకు శనివారం కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని సాయిఆరామంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గోవింద్‌నాయక్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కదిరి, ధర్మవరం, హిందూపురం ప్రాంతాల్లో మూడు చొప్పున బార్లు, మడకశిరలో 1, పెనుకొండలో 1, కల్లు గీత కార్మికులకు 1 చొప్పున బార్లను కేటాయించినట్లు పేర్కొన్నారు.