
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఎన్‌పీకుంట: తాళం వేసిన ఇంట్లోకి దుండగులు చొరబడి విలువైన బంగారు, నగదు, ఇతర సామగ్రిని అపహరించారు. పోలీసులు తెలిపిన మేరకు... అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్‌పీకుంట మండలం ఎన్.రెడ్డివారిపల్లికి చెందిన కె.నారాయణమ్మ పది రోజుల క్రితం బెంగళూరులోని కుమారుడి వద్దకెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని శుక్రవారం తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు తీసి లోపలకు ప్రవేశించిన ఆమె వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించి ఆందోళనకు గురై పరిశీలించింది. ఇంటి వెనుక ఉన్న తలుపులు బద్ధలు గొట్టి ఉన్నాయి. బీరువాలో దాచిన పొలానికి సంబంధించిన దస్తావేజులు, ఇంటి పత్రాలు, డిపాజిట్ బాండ్లు, ఎల్‌ఐసీ బాండ్లతో పాటు రెండు జతల బంగారు కమ్మలు, రూ.4వేల నగదు, విలువైన పట్టుచీరలు, 50 కిలోల బియ్యం బస్తా అపహరించుకెళ్లినట్లు గుర్తించి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే వినాయక నిమజ్జనం తర్వాత వచ్చి పరిశీలించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపి వెనక్కు పంపేశారు.
ఫిర్యాదు స్వీకరించకుండా వెనక్కు
పంపిన పోలీసులు