ఏడాదంతా ‘ఎర్రబుక్కు’ పాలనే | - | Sakshi
Sakshi News home page

ఏడాదంతా ‘ఎర్రబుక్కు’ పాలనే

Jun 4 2025 12:35 AM | Updated on Jun 4 2025 12:35 AM

ఏడాదం

ఏడాదంతా ‘ఎర్రబుక్కు’ పాలనే

సాక్షి, పుట్టపర్తి కూటమి ప్రభుత్వం అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కనబెట్టి.. నారా లోకేశ్‌ రచించిన ‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్‌ చేసి అడ్డగోలుగా కేసులు పెట్టి వేధిస్తోంది. వైఎస్సార్‌ సీపీ నాయకులతో పాటు ఎప్పుడో సోషల్‌ మీడియాలో చంద్రబాబు, లోకేశ్‌లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే సాకుతో చాలామంది అమాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయించింది.

అక్రమ కేసులు..అకృత్యాలు

పోలీసులను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న టీడీపీ నేతలు.. మాజీ మంత్రి ఉషశ్రీచరణ్‌, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, హిందూపురం సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించారు. గతేడాది జూన్‌ 4వ తేదీ ఓట్ల లెక్కింపు రోజున ప్రారంభమైన పచ్చ నేతల ఆకృత్యాలు... ఏడాది పొడవునా కొనసాగుతూనే వచ్చాయి.

ఓట్ల లెక్కింపు రోజునుంచే

గతేడాది జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు రోజున పుట్టపర్తి గోపురం మెయిన్‌ రోడ్డులోని గోపాల్‌రెడ్డి క్లినిక్‌పై టీడీపీ అల్లరిమూకలు రాళ్ల దాడి చేశాయి. అదేరోజు తలుపుల మండలం గెరికపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చెన్నక్రిష్ణారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

● గతేడాది ఆగస్టు 3న హిందూపురం మండలం గోళ్లాపురం గ్రామానికి చెందిన సతీశ్‌ అనే వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు చితకబాదగా..అతను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఇంతవరకూ నిందితులను అరెస్టు చేయలేదు.

● ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారనే కారణంతో కదిరి మండలం వీరచిన్నయ్యగారిపల్లికి చెందిన అమర్‌నాథ్‌రెడ్డి, రొద్దం మండలంలో నగరూరు బాలాజీరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.అరెస్టు పేరుతో తీవ్రంగా వేధించారు.

● ఇక టీడీపీ నేతల బెదిరింపులతో చిలమత్తూరు మండలం ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, రామగిరి మండలం కొత్తపల్లికి చెందిన ముత్యాల్‌నాయక్‌ను ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇక ఆర్థికంగా దెబ్బతీసేందుకు పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు చెందిన చీనిచెట్లను, బొప్పాయి చెట్లను, మామిడిచెట్లను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు.

కూటమి సర్కారులో ‘రెడ్‌బుక్‌’ అమలు

వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా

అక్రమ కేసులు

పలువురు అక్రమ అరెస్టు..

రిమాండ్‌కు తరలింపు

అక్కడక్కడా దాడులు, గొడవలు, హత్యలు, దోపిడీలు

రామగిరి ఎంపీపీ ఎన్నికలో గెలవలేక...

రామగిరి ఎంపీపీ ఎన్నికలో గెలవలేని టీడీపీ దుర్మార్గాలకు ఒడిగట్టింది. ఎంపీపీ ఉప ఎన్నికల కోసం అనెక్సర్‌ 1,2 ఇచ్చేందుకు మార్చి 26న రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు ఓబుగారి హరినాథ్‌రెడ్డి, బోయ రామాంజినేయులు, కురుబ నాగిరెడ్డిపై సుమారు 500 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కానీ పోలీసులు బాధితులపైనే కేసు నమోదు చేశారు.

ఎంపీపీ ఎన్నికలో పాల్గొనేందుకు మార్చి 27 బెంగళూరు నుంచి వస్తున్న పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని పెనుకొండ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు బలవంతంగా కిడ్నాప్‌ చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు.

గొడవలు వద్దని చెప్పిన పాపానికి ఉగాది పర్వదినం రోజైన మార్చి 30న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యపై టీడీపీ రౌడీలు ఇంట్లో దూరి దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన కురుబ లింగమయ్య అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హెలికాప్టర్‌లో పాపిరెడ్డిపల్లికి చేరుకోగా.. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టలేదు. ఫలితంగా హెలిప్యాడ్‌ వద్ద తోపులాట జరిగింది. అయితే పోలీసులు తమ వైఫల్యాలను పక్కనబెట్టి.. టీడీపీ నేతలు ఆదేశాల మేరకు విడతల వారీగా ఇప్పటి వరకు సుమారు 200 మందిపై కేసులు నమోదు చేశారు.

ఏడాదంతా ‘ఎర్రబుక్కు’ పాలనే1
1/3

ఏడాదంతా ‘ఎర్రబుక్కు’ పాలనే

ఏడాదంతా ‘ఎర్రబుక్కు’ పాలనే2
2/3

ఏడాదంతా ‘ఎర్రబుక్కు’ పాలనే

ఏడాదంతా ‘ఎర్రబుక్కు’ పాలనే3
3/3

ఏడాదంతా ‘ఎర్రబుక్కు’ పాలనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement