రైతు ద్రోహి ప్రభుత్వమిది
ఈ చిత్రంలోని రైతు పేరు మేకల లక్ష్మీనరసింహులు.
తాడిమర్రి మండలం. మరవపల్లి గ్రామం. తనకున్న మూడెకరాల పొలంలో ఏటా ఖరీఫ్‌లో వేరుశనగ సాగుచేస్తున్నాడు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయంతో పాటు రాయితీ విత్తన వేరుశనగ అందించడంతో పంటలు సాఫీగా సాగు చేశాడు. కూటమి ప్రభుత్వం నేటికీ రైతులకు పెట్టుబడి సాయం, రాయితీ విత్తనం అందించలేదు. దీంతో పెట్టుబడులకు డబ్బులు లేక ఏం చేయాలో తెలియక లక్ష్మీనరసింహులు సతమతమవుతున్నాడు. ఈ సారి పంట సాగుకు పెట్టుబడి ఎలా అని ఆందోళన చెందుతున్నాడు.
ఈ రైతు పేరు ఎస్.హరినాథరెడ్డి. కదిరి మండలం ముత్యాలచెరువు. ఏటా ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసేవాడు. గత ఐదేళ్లూ ‘రైతు భరోసా’ కింద వైఎస్ జగన్ సర్కార్ పెట్టుబడి సాయం సకాలంలో అందించడంతో ఉత్సాహంగా పంటలు సాగుచేసేవాడు. కానీ కూటమి సర్కార్ ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ఇస్తామన్న రూ.20 వేలు నేటికీ ఇవ్వకపోవడంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద చేతులు చాచాల్సి వస్తోందని వాపోతున్నాడు.
కదిరి: రైతులకు కష్టం కలగకుండా చూసుకుంటానంటూ ఎన్నికల వేళ హామీలిచ్చిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఏడాది పాలన సంబరాలకు సిద్ధమవుతున్న ఆయనకు..ఈ ఏడాది కాలంలో ఏనాడూ అన్నదాతలు గుర్తుకు రాలేదు. అందుకే రైతన్నలకు నయాపైసా సాయం చేసిన పాపాన పోలేదు. ఫలితంగా సాయం అందక...సాగుకు సన్నద్ధం కాలేక రైతన్న సతమతమవుతున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు.
రూ.560 కోట్లు ఎగనామం..
‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేల చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా..దానిపై ఉలుకూ పలుకూ లేదు. కేంద్రం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు సకాలంలో ఆర్థిక చేయూత ఇస్తున్నా.. చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అదిగో..ఇదిగో అని చెప్పడమే కానీ రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది లేదు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ సైతం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏనాడూ రైతుల పక్షాన మాట్లాడ లేదు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఒక్కో రైతుకు రూ.20 వేల చొప్పున సుమారు రూ.560 కోట్లు చంద్రన్న సర్కారు ఎగ్గొట్టింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదని వ్యవసాయాధికారులు అంటున్నారు.
మూడు విడతల్లో నిధులు జమ..
వైఎస్ జగన్ సర్కార్ ఖరీఫ్ సాగుకు ముందే ఏటా మే నెలలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద తొలివిడత రూ.7,500 ఇచ్చింది. తర్వాత అక్టోబర్ నెలలో పంట కోతతో పాటు రబీ సాగు అవసరాలకు రెండో విడతలో రూ.4 వేలు, జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండుగ సమయంలో మరో రూ.2 వేలు... ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు మొత్తం రూ.13,500 చొప్పున నగదు రూపంలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే ‘సున్నావడ్డీ–పంటరుణాలు’ పథకం ద్వారా 1,71,275 మంది రైతులకు రూ.67.65 కోట్లు, ‘డా.వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ ద్వారా 2,96,541 మంది రైతులకు రూ.718.57 కోట్లు, అదే విధంగా ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా రూ.16.21 కోట్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు గత ప్రభుత్వ హయాంలో లబ్ధి చేకూరింది. ఈ ప్రభుత్వం మాత్రం ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్నా రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది.
అన్నదాత దుఃఖీభవ..!
‘అన్నదాత సుఖీభవ’కు పడని అడుగులు
రైతులకు రూ.560 కోట్లు
చంద్రబాబు ఎగనామం
పెట్టుబడి సాయం కోసం
అన్నదాతల ఎదురు చూపు
ఖరీఫ్ సాగుకు ‘ప్రైవేటు’ అప్పులు
చేస్తున్న వైనం
ఖరీఫ్ సీజన్‌లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గతంలో వైఎస్ జగన్ సర్కారు సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా వచ్చే రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ.7,500 కలిపి మొత్తం రూ.13,500 ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరుతో ఏటా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలోని 2,79,556 మంది రైతులకు గత ఐదేళ్లలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ.1,767.09 కోట్ల లబ్ధి చేకూర్చింది.
జగన్
హయాంలో
అన్నదాతకు ఆర్థిక భరోసా..
చంద్రబాబుకు రైతులంటే గిట్టదు. అందుకే ఆయన వ్యవసాయమే దండగ అని గతంలోనే చెప్పారు. ఎన్నికల వేళమాత్రం రైతులకు అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఏడాది కాలంలో రైతులకు ఒరగబెట్టిందేమీ లేదు. పెట్టుబడి సాయం కూడా అందించలేదు. రైతు ద్రోహి ప్రభుత్వమిది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకివ్వాల్సిన నగదు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. లేకపోతే రైతుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాటానికి సిద్ధమవుతుంది.
– ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు,
వైఎస్సార్ సీపీ
రైతు ద్రోహి ప్రభుత్వమిది
రైతు ద్రోహి ప్రభుత్వమిది
రైతు ద్రోహి ప్రభుత్వమిది
రైతు ద్రోహి ప్రభుత్వమిది


