దేశానికే దిక్సూచి అంబేడ్కర్‌ | - | Sakshi
Sakshi News home page

దేశానికే దిక్సూచి అంబేడ్కర్‌

Apr 15 2025 12:45 AM | Updated on Apr 15 2025 12:45 AM

దేశానికే దిక్సూచి అంబేడ్కర్‌

దేశానికే దిక్సూచి అంబేడ్కర్‌

పుట్టపర్తి టౌన్‌/ప్రశాంతి నిలయం: ప్రపంచంలోనే గొప్పదైన రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్‌ దేశానికి దిక్సూచిలా నిలిచారని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తి పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ...దేశంలోని అన్నివర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్‌ కృషి చేశారన్నారు. భారత రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేలా చూశారన్నారు. ఏ అంశంౖపైనెనా సరే నేడు ప్రతి ఒక్కరూ ధైర్యంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారంటే అది అంబేడ్కర్‌ కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ వల్లేనన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం వల్లే నేడు సామాన్యులు, బడుగు, బలహీన వర్గాల వారు చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల గొంతును వినిపించగలుగుతున్నారన్నారు. ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంగాధర్‌, సాంఘిక సంక్షేమ శాఖాధికారి శివరంగప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్‌, గిరిజన సంక్షేమశాఖ అధికారి మోహన్‌రామ్‌, మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ తిప్పన్న, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డితోపాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు

అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదాం..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంత్యుత్సవాలను కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, కలెక్టరేట్‌ ఏఓ వెంకటనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

జయంతి వేడుకల్లో

జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement