వీఆర్‌ఏ హత్య కేసులో తమ్ముడి అరెస్ట్
హిందూపురం: లేపాక్షి పంచాయతీ పరిధిలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న రామాంజినప్ప(42) హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివరాలను హిందూపురం రూరల్ సీఐ కె.జనార్ధన్, లేపాక్షి ఎస్‌ఐ నరేంద్ర మంగళవారం వారు వెల్లడించారు. ఆదివారం రాత్రి తన సోదరుడు అశ్వత్థప్పతో గొడవ జరిగిన సమయంలో ప్రమాదవశాత్తు మిద్దైపె నుంచి ఆయన కిందపడి మృతి చెందాడు. మృతుని భార్య రాధమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఉదయం కల్లూరు క్రాస్ వద్ద తచ్చాడుతున్న అశ్వత్థప్పను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో గత నెల 30న అన్న రామాంజినప్ప తలపై బండరాయితో మోదీ, ఆపై మిద్దైపె నుంచి కిందికి తోసి హతమార్చినట్లు నిందితుడు అంగీకరించడంతో కేసు నమోదుచేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.


