
కదిరి టౌన్: కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుల వెండి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ, ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు. అలాగే గర్భలాయం ఎదుట ఉన్న ముఖ మంటపానికి దాదాపు 72 కేజీల వెండితో తయారు చేయించిన తొడుగును బెంగళూరుకు చెందిన లక్ష్మమ్మ, మంజునాథ్ కుటుంబసభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా వారిని పాలక మండలి తరఫున ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు, స్వామి శేష వస్త్రాన్ని, జ్ఞాపికను అందజేశారు.