అమెరికా సంస్కృతికి ఎలా ఉంది? | - | Sakshi
Sakshi News home page

అమెరికా సంస్కృతికి ఎలా ఉంది?

Published Wed, Oct 4 2023 12:32 AM | Last Updated on Wed, Oct 4 2023 10:59 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విద్యార్థిని సౌమ్య, డీఈఓ నాగరాజు - Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌: మన సంస్కృతికి, అమెరికా సంస్కృతికి ఏమైనా తేడాలు గమనించారా? అంటూ ఇటీవల ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను రాప్తాడు కేజీబీవీ 9వ తరగతి విద్యార్థిని సౌమ్య ప్రశ్నించింది. ఇంగ్లిష్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన పది మంది ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన వారితో అక్కడి అనుభవాలను ఇతర విద్యార్థులతో పంచుకునేలా మంగళవారం అన్ని జిల్లాల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పా టు చేశారు. ప్రతి జిల్లా నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా అనంతపురం నుంచి రాప్తాడు కేజీబీవీ 9వ తరగతి విద్యార్థిని ఆర్‌.సౌమ్య పాల్గొంది. డీఈఓ చాంబరులో డీఈఓ నాగరాజు, సమగ్రశిక్ష ఏఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అమెరికా దేశంలో ఐక్యరాజ్య సమితి కార్యాలయం, లిబర్టీ ఆఫ్‌ స్టాచ్యూ, వైట్‌హౌస్‌, వరల్డ్‌బ్యాంక్‌ తదితర కార్యాలయాలను సందర్శించి వచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు.

ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థుల తో ఇంట్రాక్ట్‌ అయినట్లు వెల్లడించారు. జిల్లా విద్యార్థిని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ... అక్కడి దేశస్తులు తమ ను బాగా రిసీవ్‌ చేసుకున్నారన్నారు. అక్కడ తమ అనుభవాలను పంచుకున్నారు. డీఈఓ నాగరాజు మాట్లా డుతూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

సర్టిఫికెట్ల పరిశీలన తొలిరోజు ప్రశాంతం
అనంతపురం ఎడ్యుకేషన్‌: సమగ్ర శిక్ష సహిత విద్య విభాగంలో ఖాళీగా ఉన్న రిసోర్స్‌ పర్సన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తొలిరోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది. సమగ్రశిక్ష జిల్లా కార్యాలయంలో ఈ ప్రక్రియ సాగింది. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన జాబితా మేరకు తొలిరోజు ఎంఆర్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఎంఈఓలు, హెచ్‌ఎంల బృందాలు పరిశీలించాయి. మొత్తం 144 మంది అభ్యర్థులకు గాను 120 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను సమగ్రశిక్ష ఏపీసీ, డీఈఓ నాగరాజు, ఐఈడీ కోఆర్డినేటర్‌ షమా పరిశీలించారు. రెండరోజు బుధవారం వీఐ/హెచ్‌ఐ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని డీఈఓ తెలిపారు. దరఖాస్తు సమయంలో సమర్పించిన సర్టిఫికెట్లు రెండుసెట్లు గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణతో పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తు కాపీ తీసుకురావాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement