సాక్షి మీడియా గ్రూప్‌, ఆర్‌.సి ఎగ్జామ్స్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గ్రూప్‌–2 ఉద్యోగ పరీక్షలపై రేపు ఉచిత అవగాహన సదస్సు

ఉదయం 09:30 నుంచి 12:30 గంటల వరకు

టాలెంట్‌ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రామాణిక స్టడీ మెటీరియల్‌

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దాదాపు 1,000 వరకు గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ (www.sakshieducation. com) రాష్ట్రంలోని ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ ఆర్‌.సి ఎగ్జామ్స్‌తో కలిసి జూన్‌ 4వ తేదీ ఉదయం 09:30 నుంచి 12:30 వరకు అనంతపురంలోని Ambedkar Convention Centre, Sai Nagar నందు ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ తోడుగా ఉంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే. హాజరయ్యే విద్యార్థులు ముందుగా 8985094499 ఫోన్‌ నెంబరుకు తమ పేరు, ఫోన్‌ నెంబర్‌, జిల్లా వివరాలను వాట్సప్‌లో పంపాలి.

అవగాహన సదస్సు తేదీ : జూన్‌ 4, 2023

వేదిక : అంబేడ్కర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, సాయినగర్‌, అనంతపురం

సమయం : ఉదయం 09:30 నుంచి 12:30 వరకు

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top