రెండో దశ పంచాయతీ ఎన్నికలు రేపు | - | Sakshi
Sakshi News home page

రెండో దశ పంచాయతీ ఎన్నికలు రేపు

Nov 28 2026 1:20 AM | Updated on Nov 28 2026 1:20 AM

నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో దశ ప్రక్రియకు అన్ని ఏర్పా ట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. పోలింగ్‌ను ఆదివారం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించి, ఆపై ఓట్లను లెక్కించనున్నారు. 14 మండలాల్లోని 297 పంచాయతీలు.. 2714 వార్డులకు ఎలక్షన్లను నిర్వహించాల్సి ఉంది. అయితే ఇందులో 93 సర్పంచ్‌లు, 1181 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ తరుణంలో 204 పంచాయతీలు.. 1533 వార్డుల్లో ఎన్నికలను జరపనున్నారు.

ఎన్నికల సామగ్రి పంపిణీ నేడు

ఎంపీడీఓ కార్యాలయాల వద్ద డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల సామగ్రిని శనివారం పంపిణీ చేయనున్నారు. 600కుపైగా పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, క్రిటికల్‌ కేంద్రాలుగా గుర్తించారు. ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లోనే వెబ్‌ కాస్టింగ్‌ను నిర్వహించనున్నారు. మిగిలిన చోట్ల వీడియో కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల ద్వారా ప్రక్రియను రికార్డు చేయనున్నారు.

అందని ఓటరు స్లిప్పులు

పోలింగ్‌ సమయం దగ్గరపడినా ఓటరు స్లిప్పులను ఇప్పటికీ పంపిణీ చేయలేదు. దీంతో తమ ఓటు ఎక్కడుందో తెలుసుకునేందుకు వీరు పాట్లు పడుతున్నారు. త్వరగా పంపిణీ చేయాలని కోరుతున్నారు.

4353 మంది సిబ్బంది

గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో దశ నిర్వహణకు పీఓలు, ఏపీఓలు 1951 మంది చొప్పున, ఓపీఓ – 1లను 389 మంది, ఓపీఓ – 2లు 62 మందిని నియమించారు. 480 మందిని రిజర్వ్‌లో ఉంచారు.

● 14 మండలాల్లో 208 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించగా, 42 మందిని రిజర్వ్‌లో ఉంచారు.

మలి దశకు

ఉపసంహరణల పూర్తి

నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను శుక్రవారం నిర్వహించారు. 13 మండలాల్లోని 269 సర్పంచ్‌లు, 2710 వార్డులకు స్వీకరించారు. 42 పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. నాలుగు పంచాయతీల్లో సర్పంచ్‌లు మాత్రమే ఏకగ్రీవమయ్యారు. దీంతో 223 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. పోలింగ్‌ను ఆదివారం జరపనున్నారు.

రీ సర్వేను త్వరగా

పూర్తి చేయాలి

కొండాపురం: మండలంలో నిర్వహిస్తున్న ఫేజ్‌ – 4, 5 రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించి, రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. తహసీల్దార్‌ శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ఖర్చులపై ఆరా

అనుమసముద్రంపేట: సర్పంచ్‌లతో పాటు ఇటీవల ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఖర్చులపై స్టేట్‌ అబ్జర్వర్‌ సాయిబాబా ఆరాతీశారు. దీనికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి పంపే లెక్కల వివరాలు పక్కాగా ఉండాలని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయిలో అందించాలని ఆదేశించారు. ఎంపీడీఓ ప్రసన్నకుమారి, వ్యయ అధికారి లీలానిర్మల, డిప్యూటీ ఎంపీడీఓ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement