ఎంపీపీగా ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

ఎంపీపీగా ప్రమాణ స్వీకారం

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

వింజమూరు(ఉదయగిరి): వింజమూరు ఎంపీపీగా ప్రమాణ స్వీకారాన్ని గణపం బాలకృష్ణారెడ్డి గురువారం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 12 మంది ఎంపీటీసీలతో ఆర్వో శేషగిరిరావు ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు గానూ తొమ్మిదింట్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రేవునూరు అనూషను ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డి మాట్లాడారు. మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

● ఎంపీపీ బాలకృష్ణారెడ్డి దంపతులతో పాటు వైస్‌ ఎంపీపీ రేవునూరి అనూష దంపతులు, ఇతర ఎంపీటీసీ సభ్యులను పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమ్వనయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అభినందించారు. వింజమూరులో తమ పార్టీ ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం మేకపాటిని ఘనంగా సత్కరించారు. జెడ్పీటీసీగా ఎంపికై న పల్లాల కొండారెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ రేవునూరి శ్రీనివాసులురెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు మలిరెడ్డి విజయకుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గణపం రమేష్‌, నేతలు బయ్యపురెడ్డి విజయకృష్ణారెడ్డి, పెసల నారాయణరెడ్డి, రొడ్డా కొండయ్య, పోలుబోయిన వెంకటేశ్వర్లు, ఆనంగి శ్రీనివాసులురెడ్డి, ఆనంగి రాజేష్‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement