వరినాట్లు వేసి.. నిరసన తెలిపి.. | - | Sakshi
Sakshi News home page

వరినాట్లు వేసి.. నిరసన తెలిపి..

Nov 11 2026 11:55 PM | Updated on Nov 11 2026 11:55 PM

● బురదమయమైన రహదారిపై

మహిళల నిరసన

చిల్లకూరు: రహదారిని బాగు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏరూరు గ్రామానికి చెందిన మహిళలు బుధవారం రోడ్డుపై ఏర్పడిన బురదలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. చిల్లకూరు మండల తీర ప్రాంతంలోని గుమ్మళ్లదిబ్బ వరకు 32 కిలోమీటర్ల ప్రధాన రహదారి ఉంది. ఇది పలు గ్రామాల పరిధిలో సుమారు 20 కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కూటమి ప్రభుత్వం మరమ్మతుల గురించి పట్టించుకోలేదు. ప్రజలు నిరసనలు తెలిపిన ప్రతిసారీ అధికారులు గ్రామాలకు వచ్చి నిధులు మంజూరవుతున్నాయని, త్వరలో రెండు లేన్ల రహదారి నిర్మిస్తామని హామీలు ఇస్తున్నా పనులు మాత్రం చేపట్టడం లేదు. కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానం చేసే కోస్టల్‌ కారిడార్‌ (సాగరమాల) రహదారి నిర్మాణానికి అవసరమైన మట్టి, గ్రావెల్‌ తదితర సామగ్రిని ఏఎంఆర్‌, బీవీఎస్‌ఆర్‌ కాంట్రాక్ట్‌ సంస్థలకు చెందిన 45 నుంచి 50 టన్నుల భారీ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ వాహనాల రాకపోకలతో ప్రధాన రహదారి మరింత దెబ్బతింది. వర్షాలకు ఏరూరు గ్రామంలో సుమారు ఒకటిన్నర కిలోమీటర్‌ మేర రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వీటిలో తీర ప్రాంతంలోని పవర్‌ పరిశ్రమల నుంచి వచ్చే బూడిదను నింపడంతో వర్షాలకు అది కరిగి బురదమయంగా మారింది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. రహదారిని బాగు చేసే వరకు వాహనాల రాకపోకలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement