కూటమిపై విసుగుతో వైఎస్సార్‌సీపీలోకి వలసలు | - | Sakshi
Sakshi News home page

కూటమిపై విసుగుతో వైఎస్సార్‌సీపీలోకి వలసలు

Nov 11 2026 11:55 PM | Updated on Nov 11 2026 11:55 PM

● గూడూరు సమన్వయకర్త

బూదూరు గురవయ్య

చిల్లకూరు: ‘గత ప్రభుత్వ హయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేదలు అందుకున్నారు. కూటమి పాలనలో అవి అందలేదు. దీంతో విసుగు చెందిన అనేకమంది స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు’ అని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య తెలిపారు. పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. పెద్ద ఎత్తున బ్యాండ్‌ మేళాలతో ఊరేగింపుగా జై జగన్‌ నినాదాలతో కార్యాలయానికి విచ్చేశారు. గురవయ్య వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు మున్సిపాలిటీలోని ఏడు, ఒకటి, మూడో వార్డులో చురుకై న నాయకులు గోవిందు ప్రభాకర్‌, రాణెమ్మ, గుంటపూడి శ్రీహరి, చేని విజయ్‌, గోవిందు, రవి, గంగిపాక లతల ఆధ్వర్యంలో 30 కుటుంబాల వారు, ఇంకా మరో 200 మంది టీడీపీ మద్దతుదారులు వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పరిషత్‌ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో నామినేషన్ల సమయం నుంచి ఓట్ల లెక్కింపు వరకు జరిగిన పరిణామాలను ప్రజలు గమనించారన్నారు. అధికార పార్టీ చేసిన ప్రతి అరాచకాన్ని, దాడులు, దౌర్జన్యాలను చూసిన ప్రజలు కూటమి పాలనను అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా వార్డుల వారీగా పార్టీలో చేరేందుకు ముందుకొచ్చే వారిని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారు గురవయ్యను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో గూడూరు పట్టణ కన్వీనర్‌ బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు మనుబోలు సతీష్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా నాయకులు పల్లి కోటేశ్వరరావు, విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement