అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Nov 11 2026 11:55 PM | Updated on Nov 11 2026 11:55 PM

అల్లూరు: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని పురిణి – మందిరం రోడ్డు ప్రాంతంలో చోటు చేసుకుంది. అల్లూరు ఎస్సై శ్రీనివాసరెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. పురిణి – మందిరానికి వెళ్లే రోడ్డు పక్కన పేర్చిన ఎలక్ట్రికల్‌ స్తంభాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి చనిపోయి ఉండగా గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతను సిమెంట్‌ స్తంభాలపై నిద్రపోతుండగా ఒకటి ఒరిగి పైన పడటంలో చనిపోయాడా? ఇతర కారణం ఏమైనా ఉందా అని పోలీసులు ఆరాతీస్తున్నారు. వయసు 50 సంవత్సరాల పైన ఉంటుందని భావిస్తున్నారు. అనుమాన్పాద మృతిగా కేసు నమోదు చేశారు.

ఘనంగా యూనియన్‌ బ్యాంక్‌

వ్యవస్థాపక దినోత్సవం

నెల్లూరు(బృందావనం): యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నెల్లూరు రీజియన్‌ ఆధ్వర్యంలో 108వ వ్యవస్థాపక దినోత్సవం బుధవారం నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్‌ వద్ద ఉన్న సీపీఆర్‌ కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. బ్యాంక్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన బ్యాంక్‌ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. సిబ్బంది ఐక్యతను ప్రతిబింబించింది. బ్యాంక్‌ ప్రస్థానం, ఘనమైన చరిత్ర, వారసత్వాన్ని స్మరించుకుంటూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు ఒకే వేదికపై కలుసుకుని వేడుకలు జరుపుకోవడం చిరస్మరణీయంగా నిలిచాయి. ఆ బ్యాంక్‌ రీజినల్‌ హెడ్‌ శ్రీనివాస్‌ దాస్యం, రీజినల్‌ అష్యూరెన్స్‌ హెడ్‌ రాఘవరెడ్డి మాట్లాడుతూ బ్యాంక్‌ భవిష్యత్‌లో మరింత అభివృద్ధిని సాధించి, విజయపథంలో ముందుకుసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement