పంచాయతీల్లో అవినీతి తిమింగలాలు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో అవినీతి తిమింగలాలు

Sep 29 2026 11:58 PM | Updated on Sep 29 2026 11:58 PM

జిల్లాలోని పంచాయతీల్లో అవినీతి తిమింగలాల దందా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రత్యేకాధికారుల పాలన నడుస్తుండటం.. వారి పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండటంతో ఇక తమకు తిరుగేదనే భావన ఇక్కడి వారిలో నెలకొంది. ఫలితంగా చేయని పనులకు బిల్లులు సృష్టించడం.. ఆపై నిధులను తమ కుటుంబసభ్యులు, స్నేహితుల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేసి స్వాహా పర్వానికి తెరలేపారు. ఒక్క కలువాయిలోనే రూ.90 లక్షల మేర గోల్‌మాల్‌ జరగడం విస్మయాన్ని కలిగిస్తోంది.

నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీల్లో నిధులను సక్రమంగా ఖర్చు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా రూ.లక్షలను ఆరగించే పనిలో నిమగ్నమయ్యారు. చేయని పనులకు బిల్లులు పెట్టి కుటుంబసభ్యులు, స్నేహితుల బ్యాంక్‌ ఖాతాల్లో నిధులను జమచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

అందరూ కుమ్మకై ్క..!

కలువాయి మేజర్‌ పంచాయతీలో సుమారు రూ.90 లక్షల 15వ ఆర్థిక సంఘ, సాధారణ నిధులను బొక్కేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శి, అక్కడ పనిచేసే ఉద్యోగి కుమ్మకై ్క స్వాహా పర్వానికి తెరలేపారు. చేయని వర్కులను చేసిన విధంగా చూపి నిధులను ఆరగించారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ కాని వ్యక్తి నిధులను కొల్లగొట్టి అందులో వాటాలను మండలాధికారులకూ అందిస్తున్నారు. ఫలితంగా ఈ అంశాలు వెలుగులోకి రావడంలేదు.

అంతా సవ్యమట..!

నిధుల దుర్వినియోగంపై జిల్లా అధికారులకు ప్రజలు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ అంశమై విచారణ చేపట్టిన ఆఫీసర్లకు భారీగా నగదును ముట్టజెప్పడంతో అంతా సవ్యంగా ఉందనే నివేదికలను అందించారని తెలుస్తోంది. ఆడిట్‌ ఆఫీసర్లు సైతం ఇలానే వ్యవహరించారని సమాచారం. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రస్తుతం నడుస్తోంది. అయితే పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయి. కలువాయి, కోవూరు, రాపూరు, ఆత్మకూరు, వింజమూరు, కావలి, అల్లూరు, ఇందుకూరుపేట తదితర మండలాల్లో నిధులు దుర్వినియోగమవుతున్నాయని తెలుస్తోంది.

డీజిల్‌ పేరుతో లూటీ

జిల్లాలోని ముత్తుకూరు, తదితర మండలాల్లో గల ఆరు పంచాయతీల్లో లీటర్‌ డీజిల్‌ను రూ.లక్షలకు కొనుగోలు చేశారు. ఒక్క ఈ మండలంలోని రెండు పంచాయతీల్లో 26 లీటర్ల డీజిల్‌కు రూ.21 లక్షలను వెచ్చించడం కలకలం రేపుతోంది. విషయాన్ని పరిశీలించి నివ్వెరపోవడం పంచాయతీరాజ్‌ కమిషనర్‌ వంతైంది. అసలీ మొత్తంతో చమురును కొనుగోలు చేశారా.. లేక బంగారాన్ని కొన్నారాననే అంశం అర్థం కాక తికమకపడ్డారు. ఈ వ్యవహారంలో సంబంధిత పంచాయతీ కార్యదర్శులపై చర్యలకు పీఆర్‌ కమిషనర్‌ ఆదేశించినా, నేటికీ అతీగతీ లేదు. నిధులను కొందరు ప్రత్యేకాధికారులు స్వాహా చేస్తూ అందులో వాటాలను జిల్లా అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. భారీ స్థాయిలో మామూళ్లు అందుతుండటంతో ఇటీవల పనిచేసిన ఓ ఉన్నతాధికారి తన పోస్ట్‌ను కాపాడుకునేందుకు శతవిధాలా యత్నించారు. దీనికి సంబంధించి కూటమి నేతలు, మంత్రులు, అధికారులతో సిఫార్సు చేయించినా ప్రయోజనం లభించలేదు.

లీటర్‌ డీజిల్‌కు రూ.లక్షలు

చేయని పనులకు బిల్లులు

భారీగా నిధుల స్వాహా

కుటుంబసభ్యులు, స్నేహితుల

బ్యాంక్‌ ఖాతాల్లో జమ

కలువాయిలో రూ.90 లక్షల గోల్‌మాల్‌

విచారణ జరిపి

చర్యలు చేపడతాం

గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను సక్రమంగా వెచ్చించాలి. నిధులను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు. విచారణ జరిపి.. ఈ అంశం తేలితే యాక్షన్‌ తీసుకుంటాం.

– వెంకటరామన్‌, డీపీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement