నెల్లూరు(టౌన్): జిల్లా స్థాయి యోగా పోటీలను వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా యోగా క్రీడా అసోసియేషన్ అధ్యక్షుడు నిర్మల నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరులోని నిర్మల సౌధలో పోటీలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అన్నమయ్య సర్కిల్లోని ఓవెల్ స్కూల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 8 నుంచి 60 ఏళ్ల వయస్సు వారు పాల్గొనవచ్చన్నారు. విజేతలు వచ్చే నెల 10, 11 తేదీల్లో కావలిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. వివరాలకు 88856 68752 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రసన్నకుమార్, సభ్యులు హేమంత్‌కుమార్‌రెడ్డి, అబిదా సుల్తానా పాల్గొన్నారు.


