‘పెద్దిరెడ్డిపల్లి’ గతింతేనా..? | - | Sakshi
Sakshi News home page

‘పెద్దిరెడ్డిపల్లి’ గతింతేనా..?

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

● ఏళ్లుగా పూర్తి కాని ప్రాజెక్ట్‌

● మెట్ట ప్రాంత వాసుల సాగునీటి

కల సాకారమయ్యేదెప్పటికో..?

● పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం

ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలాలకు సాగు, తాగునీరందించే వెలిగొండ ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ పనులు ఏళ్లుగా నిలిచిపోయాయి. 2004లో దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో నిధులను మంజూరు చేశారు. ఈ క్రమంలో శంకుస్థాపనను అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేపట్టారు. ఆ సమయంలో ప్రాజెక్ట్‌ పనులు పరుగులు పెట్టాయి. అయితే వైఎస్సార్‌ మరణానంతరం దీని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

ఎక్కడేసిన గొంగళి అక్కడే..

అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ తర్వాతి టీడీపీ సర్కార్‌ సైతం ఈ ప్రాజెక్ట్‌పై కన్నెత్తి చూసిన దాఖలాల్లేవు. దీంతో ఎక్కడేసిన గొంగళి అక్కడే అనే చందంగా పరిస్థితి మారింది. ఫలితంగా ప్రాజెక్ట్‌ చిల్లచెట్లతో అసంపూర్తిగా మిగిలిపోయింది. వాస్తవానికి ఆరు టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. 3.98 కిలోమీటర్ల ఉపకాలువల ద్వారా నాలుగు మండలాల్లోని 65 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. పనులు ముందుకుసాగేలా గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. అయితే కోవిడ్‌ తదనంతర పరిస్థితులు, వివిధ అడ్డంకులతో నిలిచిపోయాయి.

ఏదీ ప్రయోజనం..?

వెలిగొండ ప్రాజెక్ట్‌ నుంచి టన్నెల్‌ ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని చంద్రబాబు ఇటీవల విడుదల చేశా రు. అయితే ఇక్కడ ప్రధాన కాలువ పూర్తి కాకపోవడంతో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌కు నీరొచ్చే అవకాశం లేకుండా పోయింది. వెలిగొండ ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేసినా, ఉదయగిరి ప్రాంత ప్రజలకు చేకూరే ప్ర యోజనమేమీ లేదు. నిధులను మంజూరు చేసే దిశగా ఆయన ఎలాంటి చొరవ చూపడంలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement