జనసమీకరణకు అధికారులపై ఒత్తిడి | - | Sakshi
Sakshi News home page

జనసమీకరణకు అధికారులపై ఒత్తిడి

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

ఉదయగిరి: వరికుంటపాడు మండలంలోని రామాపురంలో మంగళవారం నిర్వహించనున్న పల్లె పండగ – 3.0 సభకు భారీ స్థాయిలో జనాన్ని తరలించేందుకు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఉపాధి కూలీలను తరలించే బాధ్యతను ఆయా మండలాల ఎంపీడీఓలకు అప్పగించారు. అంగన్‌వాడీ కార్యకర్తలూ రావాల్సిందిగా ఆ శాఖకు చెందిన అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఉదయగిరి, వరికుంటపాడు, కలిగిరి, దుత్తలూ రు మండలాల్లోని పలు పాఠశాలకు సెలవును ప్రకటించారు. సమీపంలోని హైస్కూళ్లను పోలీసులు, ఇతర అధికారుల బసకు కేటాయించడంతో బడులను సోమ, మంగళవారం మూసేయ డంపై తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప జిల్లాల నుంచి దాదాపు లక్ష మందిని సభకు తరలించనున్నారని సమాచారం. పల్లె పండగ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కేజీబీవీలో

రహస్య విచారణ

కలిగిరి: కలిగిరిలోని కేజీబీవీలో రహస్యంగా విచారణను ఏపీసీ వెంకటసుబ్బయ్య సోమవారం చేపట్టారు. విద్యాలయంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలొస్తున్న తరుణంలో విద్యార్థినుల తల్లిదండ్రులు, మీడియాకు కూడా సమాచారమివ్వకుండా సిబ్బందిని విచారించారు. వీరితో వేర్వేరుగా మాట్లాడి వివరాలను సేకరించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారని సమాచారం. విద్యాలయంలో జరుగుతున్న పూర్తి సమాచారంతో డీఈఓ కార్యాలయానికి బుధవారం రావాల్సిందిగా ప్రిన్సిపల్‌ సుప్రియను సూచించారు.

సీఎం పర్యటన నేడు

నెల్లూరు రూరల్‌: జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంగళవారం రానున్నారు. వరికుంటపాడు మండలం రామాపురానికి మధ్యాహ్నం 2.15కు చేరుకోనున్నారు. కాకొల్లువారిపల్లిలో బీటీ రోడ్డును పరిశీలించి, ఉపాధి హామీ కూలీలతో కలిసి శ్రమదానంలో పాల్గొననున్నారు. రామాపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 5.30కు తిరిగి బయల్దేరనున్నారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 83,578 మంది ఆదివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement