జనం గోడు గాలికి.. | - | Sakshi
Sakshi News home page

జనం గోడు గాలికి..

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

● సీఎం వస్తున్నారని గ్రీవెన్స్‌ రద్దు

అర్జీలిచ్చేందుకు వచ్చి..

సెక్యూరిటీ గార్డును అడుగుతూ..

తిక్కన ప్రాంగణం ఎదుట తొలగించిన షామియానా

వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎదురు చూస్తున్న అర్జీదారులు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ కష్టాలు చెప్పుకునేందుకు సోమవారం వృద్ధులు, మహిళలు నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన

ప్రాంగణం వద్దకు వచ్చారు. అయితే అక్కడ వారి సమస్యలు వినేందుకు ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. మంగళవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జిల్లా

పర్యటన నేపథ్యంలో గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పర్యటన ఏర్పాట్లలో అధికార

యంత్రాంగం నిమగ్నం కావడంతో సమస్యలు చెప్పేందుకు వచ్చిన అర్జీదారులు ఆవేదన

చెందారు. వినతిపత్రాలు తీసుకునే వారులేక చెట్ల కింద కూర్చొని గంటల తరబడి ఎదురు చూశారు. ముఖ్యుల పర్యటనల సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన కార్యక్రమాలు రద్దు చేయడంపై విమర్శలు

వ్యక్తమయ్యాయి.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement