● అత్యధికంగా టీపీగూడూరు
మండలంలో 130.2 మిల్లీమీటర్లు
నెల్లూరు(అర్బన్): ఎండ తీవ్రతను తాళలేక అల్లాడిపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేలా జిల్లా వ్యాప్తంగా వర్షాలు రెండు రోజులుగా కురిశాయి. కొన్ని మండలాల్లో భారీగా.. మరికొన్ని మండలాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. ఉరుములు, మెరుపులతో వర్షం శనివారం అర్ధరాత్రి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా సరాసరి వర్షపాతం 22.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. తోటపల్లిగూడూరు మండలంలో అత్యధికంగా 130.2.. అనుమసముద్రంపేటలో అత్యల్పంగా ఒక మిల్లీమీటర్ కురిసింది. ఇందుకూరుపేటలో 99.8, రాపూరులో 61.4, విడవలూరులో 57.2, వెంకటాచలంలో 46.8, నెల్లూరు రూరల్‌లో 45.6, కోవూరులో 42.2, నెల్లూరు అర్బన్‌లో 39.2, మర్రిపాడులో 34.8, బుచ్చిరెడ్డిపాళెంలో 29.6, ముత్తుకూరులో 23.4, మనుబోలులో 22.4, పొదలకూరులో 16.4, సైదాపురంలో 14.8, గూడూరులో 14.6, సంగంలో 3.6, జలదంకిలో 12.8, చిల్లకూరులో 11.6, అల్లూరు, సీతారామపురంలో పది మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.


