● కూటమి ప్రభుత్వంపై యుద్ధం
ఎప్పుడో మొదలైంది
● వైఎస్సార్‌సీపీ కావలి ఇన్‌చార్జి
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
అల్లూరు: రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి వైఎస్సార్‌సీపీ జెండాను రెపరెపలాడించాలని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం అల్లూరు మండల విస్తృత స్థాయి సమావేశాన్ని స్థానిక కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో నిర్వహించారు. ముందుగా అల్లూరు ఇస్కపల్లి క్రాస్‌రోడ్డు నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో రామిరెడ్డి మాట్లాడుతూ రెండున్నరేళ్ల కూటమి పాలనలో జరిగిన మోసాలు, వైఫల్యాలు, నేతల అక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇలాంటి పథకాలు ఎప్పుడిస్తారో తెలియదన్నారు. ట్రూఅప్ చార్జీల పేరుతో కరెంట్ బిల్లులు పెంచారన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారంటూ నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని, ప్రస్తుతం అవే మీటర్లు పెడుతున్నా నోరు మొదపడం లేదని విమర్శించారు. కొత్త పెన్షన్ల మంజూరుకు అనేక నిబంధనలు పెడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. 2029లో తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.
కేసులకు భయపడొద్దు
చంద్రబాబు చరిత్రలో ఇప్పటి వరకు కేవలంలో ఒక్కసారి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టారని రామిరెడ్డి అన్నారు. ఇప్పుడు కూడా పెడతారో లేదో నమ్మకం లేదన్నారు. ఒకవేళ ఎన్నికలు పెడితే అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల వేళ కూటమి నాయకుల నుంచి ప్రలోభాలు వస్తాయన్నారు. కేసులు పెడతామని బెదిరిస్తారని, వాటిని ఎవరూ లెక్క చేయొద్దన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎన్నికలంటే ఎప్పుడైనా అధికార పార్టీ నాయకుల సిద్ధంగా ఉంటారని కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండటంతో కూటమి నేతలకు భయం పట్టుకుందన్నారు. మండల పరిధిలో ఎక్కడ కూడా ఏకగ్రీవాలకు తావివ్వకుండా గెలుపో.. ఓటమో ఏదైనా తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు, వియజ డెయిరీ మాజీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం సాయికుమార్, రూరల్ అధ్యక్షుడు బీద రమేష్, నాయకులు ఉస్మాన్ షరీఫ్, పాండు రంగారెడ్డి, చెంతాటి కరుణాకర్, మేడా మాధవ్, పరిశినేటి రాజేష్, గండ్ల హర్ష, తాండ్ర మల్లీ, మధురెడ్డి, షేక్ జంషీర్, సురేష్, కొండూరు శీనయ్య, పవన్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, నరసింహారావ్, పాటి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


