మర్రిపాడు: మండలంలోని చాబోలులో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ ఆలయంలో జాతరను ఆదివా రం వైభవంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దుగ్గిరెడ్డి కృష్ణప్రసాద్‌రెడ్డి ఆహ్వానం మేరకు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, పరిశీలకుడు కూనం సుధాకర్‌రెడ్డితో కలిసి చాబోలుకు చేరుకున్నారు. పోలేరమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలేరమ్మ ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షించారు. తొలుత వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు.


