క్లుప్తంగా
నెల్లూరు(బృందావనం): నెల్లూరు మినీబైపాస్ రోడ్డు అన్నమయ్య సర్కిల్ గోమతినగర్‌లో ఉన్న జోయాలుక్కాస్ నెల్లూరు–2లో ప్రిమోరా డైమండ్ కలెక్షన్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మొహ్మద్ అక్రమ్, అసిస్టెంట్ మేనేజర్ నితిన్ మాట్లాడుతూ ప్రేమను శాశ్వతంగా నిలిపే అద్భుతమైన ‘వేర్ లవ్ బికమ్స్ ఫర్ ఎవెర్’ థీమ్‌తో కలెక్షన్‌ను వినియోగదారుల సమక్షంలో ఆవిష్కరించినట్లు తెలిపారు. ప్రేమ, అందం, నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ప్రత్యేకమైన డైమండ్ ఆభరణాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అర్బన్ ఆర్యవైశ్య సంఘ
అధ్యక్షుడిగా నాగేశ్వరరావు
నెల్లూరు(బృందావనం): ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మునగా నాగేశ్వరరావు నియమితులయ్యారు. నెల్లూరు పప్పులవీధిలో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఆర్యవైశ్య సంఘం నేత మాజీ మంత్రి టీజీ వెంకటేష్, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మేయర్ సుజాత తదితరులు హాజరయ్యారు. ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి కృషిచేయాలని నేతలు సూచించారు.


