ఆర్థిక సాయం కోసం.. | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సాయం కోసం..

Sep 11 2026 11:21 AM | Updated on Sep 11 2026 11:21 AM

అనారోగ్యంతో గుంటూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన 14 ఏళ్ల కుమార్తె కర్రా తేజస్విని ప్రాణాలు కాపాడేందుకు ఆర్థిక సాయం అందించాలని నెల్లూరు వైఎస్సార్‌ నగర్‌కు చెందిన కర్రా ఆదినారాయణ జేసీకి వినతిపత్రం సమర్పించారు. తేజస్వినికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారని తెలిపారు. సీఎంఎఫ్‌ సాయం కాకుండా చికిత్సకు సుమారు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి వలస వచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నానని చెప్పారు. తేజస్విని ప్రాణాలు కాపాడేందుకు దాతలు, ప్రజలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement