వారంరోజుల గడువు ఇస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

వారంరోజుల గడువు ఇస్తున్నాం

Sep 11 2026 11:21 AM | Updated on Sep 11 2026 11:21 AM

సమస్యలు పరిష్కరించాలి

సచివాలయ ఉద్యోగుల డిమాండ్‌

నెల్లూరురూరల్‌: సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం వార్డు సెక్రటరీస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ బాలార్జున్‌ తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్‌ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైజాగ్‌ వేదికగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడు రోజులుగా కొనసాగినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆవేదన పెరిగిందన్నారు. దీంతో భారీ సంఖ్యలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారని తెలిపారు. తమ ఆందోళన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోసమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుత నిరసన కార్యక్రమాలను వారంరోజులపాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈలోగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత భారీ స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం చేపట్టే ప్రతి కార్యాచరణకు నెల్లూరు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమావేశంలో ఆ సంఘం నేతలు పాండు, హరీష్‌, సతీష్‌, చైతన్య, పవన్‌కుమార్‌, పృథ్వీ, సహన్‌, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement