జగన్‌ను కలిసిన పర్వతరెడ్డి | - | Sakshi
Sakshi News home page

జగన్‌ను కలిసిన పర్వతరెడ్డి

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

నెల్లూరు రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం కలిశారు. నగర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న చర్యలను వివరించారు.

సోమశిలలో

16.85 టీఎంసీలు

సోమశిల: సోమశిల జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 16.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎండ తీవ్రతకు 133 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. పెన్నా డెల్టాకు 2700, కండలేరు కాలువకు 350 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలాశయంలో 87.066 మీటర్ల నీటిమట్టం నమోదైంది.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 69,440 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

అర్హుల నుంచి దరఖాస్తులను

స్వీకరించండి

నెల్లూరు(పొగతోట): కొత్త పింఛన్లకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సూచించారు. నగరంలోని డీఆర్డీఏ కార్యాలయం నుంచి మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. సచివాలయాల ద్వారా దరఖాస్తులను ఈ నెల 16 నుంచి స్వీకరించాలని సూచించారు.

వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు

నెల్లూరు సిటీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వ అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా నెల్లూరు బ్యారే జీ సందర్శన నిమిత్తం వెళ్లిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌, గూడూరు సమన్వయకర్తలు ఆనం విజయకమార్‌రెడ్డి, గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతి, మరికొందరిపై కేసులను సంతపేట పోలీసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement