● బస్తా కాయలు రూ.18 వేలు
పొదలకూరు: నిమ్మ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్తా (లూజు) కాయల ధర రూ.18 వేలు పలుకుతోంది. దిగుబడి లేకపోవడంతో రేట్లు ౖపైపెకెళ్తున్నాయని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. పొదలకూరు నిమ్మ మార్కెట్ పరిధిలోని నాలుగైదు మండలాల్లో గల తోటల్లో కాయల్లేకపోవడంతో ఊహించని విధంగా డిమాండ్ పెరిగింది. పది కిలోల కాయలున్నా రూ.రెండు వేలకుపైగా తీసుకెళ్తున్నారు. పొదలకూరులోని యార్డులో బస్తాలకు బస్తాలను తోలుకొచ్చే రైతులు ఇప్పుడు స్వల్పంగా తీసుకొస్తున్నారు. కొందరైతే పది కిలోలను సైతం కవర్లలో తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కిలోల్లెక్కన చూస్తే రూ.150 నుంచి రూ.225 వరకు ధరలు లభిస్తున్నాయి.
ఆటోల్లో ఎగుమతులు
సీజన్లో నిత్యం పది నుంచి 15 లారీల్లో నిమ్మకాయలను వివిధ రాష్ట్రాలకు తరలించే వ్యాపారుల్లో కొందరు ప్రస్తుతం ఆటోల్లో సైతం చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తోటల నుంచి బస్తా కాయలను తెచ్చే రైతు లేకుండాపోయారని పేర్కొంటున్నారు.


