158 మందికి ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

158 మందికి ఉద్యోగాలు

Aug 30 2026 12:21 AM | Updated on Aug 30 2026 12:21 AM

నెల్లూరు (టౌన్‌): నగరంలోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాలో 158 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అభ్యర్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు నియామక పత్రాలను అందజేశారు. మొత్తం 19 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ గిరి, వైస్‌ ప్రిన్సిపల్‌ రమణారావు, జేకేసీ కోఆర్డినేటర్‌ గీత, జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌ వినయ్‌కుమార్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్‌ఖయ్యూం, సెట్నల్‌ సీఈఓ నాగేశ్వరరావు, లలిత, ఏడుకొండలు, వేణు తదితరులు పాల్గొన్నారు.

‘ఐఎన్‌ఎస్‌

ఉదయగిరి’కి ఏడాది

నేవీ బృందం బైక్‌ ర్యాలీ

ఉదయగిరి: ‘ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి’ యుద్ధ నౌక ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖ నుంచి నేవీ బృందం చేపట్టిన బైక్‌ ర్యాలీ శనివారం ఉదయగిరికి చేరింది. ముందుగా వీరు పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్‌ కమాండర్‌ సూరజ్‌ గణేశ్‌, లెఫ్టినెంట్‌ భారత్‌ అనుక మాట్లాడుతూ 2025 ఆగస్టు 26న ‘ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి’ నౌక ప్రారంభమైందన్నారు. తొలి వార్షికోత్సవం సందర్భంగా ఉదయగిరి పట్టణాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, రక్షణ రంగంపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఈ ఏడాది నుంచి నేవీ తరఫున ఉపకార వేతనాలు అందిస్తామని తెలిపారు. అనంతరం పాఠశాల తరఫున హెచ్‌ఎం, ఉపాధ్యాయులు వారికి జ్ఞాపిక అందజేశారు. నేవీ సిబ్బంది రామునివాస్‌, సుమిత్‌, పి.విశ్వేశ్వరరావు, అర్నాకులేరియా, లోకేశ్‌, పాఠశాల హెచ్‌ఎం జి.శ్రీనివాసులు, ఇండియన్‌ నేవీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement