రంగులు కలిపిన చికెన్‌, పాడైపోయిన కాలీఫ్లవర్‌ | - | Sakshi
Sakshi News home page

రంగులు కలిపిన చికెన్‌, పాడైపోయిన కాలీఫ్లవర్‌

Aug 30 2026 12:21 AM | Updated on Aug 30 2026 12:21 AM

బుచ్చిలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

బుచ్చిరెడ్డిపాళెం: ఫుడ్‌ సేఫ్టీ అధికారులు బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధిలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గిరిజాహాల్‌ సెంటర్‌, మలిదేవి సెంటర్‌, బస్టాండ్‌ ప్రాంతంలోని కొన్ని హోటళ్లలో కృత్రిమ రంగులు కలిపిన, పాడైపోయిన చికెన్‌, సరిగా ఉడకని చపాతీలు, పరోటాలు, వినియోగానికి అనర్హమైన కాలీఫ్లవర్‌ తదితర ఆహార పదార్థాలను గుర్తించారు. సుమారు ఐదు కేజీల పాడైన కాలీఫ్లవర్‌తో పాటు ఇతర నాణ్యత లేని ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. అలాగే పలుచటి పాలిథిన్‌ కవర్లలో వేడి పదార్థాలను ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించి, వాటిని నిలిపివేయాలని వ్యాపారులను హెచ్చరించారు. సుమారు 15 కేజీల పాడైపోయిన చికెన్‌ను ధ్వంసం చేశారు. పరిశుభ్రత పాటించని ఏడు హోటల్స్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే ఆహార తయారీ ప్రదేశాల్లో అపరిశుభ్రత, నిబంధనలు ఉల్లంఘించిన ఐదు హోటల్స్‌పై కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement