వెంకటాచలం: అనారోగ్యం కారణంగా మండలంలోని చెముడుగుంట వద్దనున్న జిల్లా జైలులో ఖైదీ మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు రూరల్ సుందరయ్య కాలనీకి చెందిన షేక్ చిన మౌలాలి(48) కొంతకాలంగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. శనివారం ఉదయం మౌలాలి తన సెల్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో మరో ఖైదీ గమనించి వార్డెన్‌కు సమాచారం అందించాడు. వెంటనే చికిత్స నిమిత్తం జైలు అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించాడని నిర్ధారించారు. ఈ విషయాన్ని వెంకటాచలం పోలీసులకు తెలియజేశారు. జైలు సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్
పేలుడులో గాయపడిన మహిళ మృతి
ఆత్మకూరురూరల్: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో ఈనెల 11న జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో షేక్ జమీల తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమెను మెరుగైన వైద్యం కోసం చైన్నెలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని శనివారం స్వగ్రామమైన మహిమలూరుకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
నిమ్మధరలు (కిలో)
పెద్దవి : రూ.150
సన్నవి : రూ.85
పండ్లు : రూ.40


