బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి

Aug 30 2026 12:21 AM | Updated on Aug 30 2026 12:21 AM

వెంకటాచలం: బాలికలు చదువుతో పాటు అన్నిరంగాల్లోనూ రాణించాలని ఎస్పీ అజిత వేజెండ్ల పిలుపునిచ్చారు. మండలంలోని సరస్వతీనగర్‌ వద్దనున్న అక్షర విద్యాలయంలో సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 బాలికల బాస్కెట్‌ బాల్‌ పోటీలను ఆమె శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత దేశానికి ఎంతో అవసరమని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో రెండు తెలు గు రాష్ట్రాలకు చెందిన 120 టీమ్‌లకు గాను 1,500 మంది బాలికలు, వారితో పాటు కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్‌ కుముద, ప్రిన్సిపల్‌ ప్రియా జాకబ్‌, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ కోఆర్డినేటర్‌ జనార్దన్‌రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement