● బస్తా కాయలు రూ.12 వేలు
పొదలకూరు: తోటల్లో కాయలు గణనీయంగా తగ్గిపోవడంతో నిమ్మ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో బస్తా (లూజు) రేట్లు రూ.12 వేలు ప్రస్తుతం పలుకుతున్నాయి. కిలోల వంతునైతే ఇది రూ.85 నుంచి రూ.150 వరకు ఉందని వ్యాపారులు వెల్లడించారు. శ్రావణ మాసం సందర్భంగా తమిళనాడులో నిమ్మకాయలకు డిమాండ్ బాగా పెరిగింది. ఫలితంగా ఇక్కడ ధరలు ఎగబాకుతున్నాయి. అయితే తోటల్లో కాయల్లేకపోవడంతో రైతులకు పెద్దగా ఉపయోగం లభించడంలేదు. మార్కెట్‌కు కాయలు స్వల్పంగా వస్తుండటంతో ఎగుమతి తగ్గిపోతోంది. తోటల నుంచి దిగుబడి ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు.
నీట్ పీజీ పరీక్షకు
పటిష్ట బందోబస్తు
నెల్లూరు(క్రైమ్): నీట్ పీజీ పరీక్షకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని నాలుగు కేంద్రాల్లో ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరగనుందని, అభ్యర్థులు ముందే చేరుకోవాలని సూచించారు. ఉదయం 8.30 తర్వాత ఎవర్నీ అనుమతించబోమని స్పష్టం చేశారు.
సోమశిల
జలాశయంలో తనిఖీ
సోమశిల: సోమశిల డ్యామ్‌ను జలాశయ భద్రత కమిటీ అధికారులు క్షేత్రస్థాయిలో శనివారం సందర్శించారు. ప్రస్తుత నీటి నిల్వ వివరాలపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. క్రస్ట్ గేట్ల పనితీరు, జలాశయ ప్రస్తుత స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం డ్యామ్ మ్యాప్‌ను పరిశీలించి భవిష్యత్తులో చేపట్టాల్సిన రక్షణ చర్యలు, జాగ్రత్తలపై ఇంజినీర్లతో చర్చించారు. జలాశయ దృఢత్వం, పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక పరిశీలన జరిపారు. క్షేత్రస్థాయిలో సేకరించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి త్వరలోనే సమర్పించనున్నామని వెల్లడించారు. కమిటీ అధికారులు గోపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, తెలుగుగంగ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యరావు, సోమశిల ఈఈ శ్రీనివాసులు, డీఈఈలు రవీంద్ర ప్రసా ద్, విజేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
సింహపురిలో
నిధి అగర్వాల్ సందడి
● ఏకాధి సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ప్రారంభం
నెల్లూరు(బృందావనం): నగరంలోని ఆచారివీధిలో ఏర్పాటు చేసిన ఏకాధి సిల్వర్ జ్యువెలరీ స్టోర్‌ను సినీ నటి నిఽధి అగర్వాల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నాణ్యమైన వెండి ఆభరణాలు, వినూత్న డిజైన్లతో నెల్లూరు నగర ప్రజలకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఏకాధి సిల్వర్ జ్యువెలరీని ఆదరించాలని కోరారు. గతంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నెల్లూరుకు తానొచ్చానని చెప్పారు. మలైకాజా.. నెల్లూరు భోజనం తనకెంతో ఇష్టమని తెలిపారు. హిందీ, తెలుగులో రెండు చొప్పున సినిమాల్లో నటిస్తున్నానని, త్వరలోనే విడుదల కానున్నాయని పేర్కొన్నారు. ఏకాధి సిల్వర్ జ్యువెలరీ డైరెక్టర్లు వేణు రాచకొండ, శివచరణ్ ఉప్పలంచి, నెల్లూరు ఫ్రాంచైజ్ భాగస్వాములు వానరాసి గౌతమ్, కొండేటి సాయికృష్ణ, యన్నారు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


