అధికారం మాది.. ఆపేదెవరు..! | - | Sakshi
Sakshi News home page

అధికారం మాది.. ఆపేదెవరు..!

Aug 23 2026 12:10 AM | Updated on Aug 23 2026 12:16 AM

రెచ్చిపోతున్న టీడీపీ నేతలు

యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: అధికారం తమదనే ధీమాతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేస్తూ భారీగా వెనుకేసుకుంటున్నారు. తాజాగా చిట్టమూరు మండలం గునపాడులో ఆర్‌ అండ్‌ బీ స్థలంపై వీరి కన్ను పడింది. ఇంకేముంది ఆక్రమించి దుకాణాల నిర్మాణానికి పునాదులను జేసీబీతో శనివారం తీశారు. దీనిపై ఆ శాఖ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేయగా, హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అయితే రెడ్‌బుక్‌ రాజ్యాంగ ధీమాతో బోర్డును పీకేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. చివరికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఆ శాఖ ఆఫీసర్లు చేతులెత్తేశారు. మరోవైపు ఆర్‌ అండ్‌ బీ రోడ్డు పక్క నుంచే పొలాల్లోకి రైతులు వెళ్లాల్సి ఉంది. అయితే స్థల ఆక్రమణతో తమకు తిప్పలు తప్పవని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇలాంటి భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు, గొడవలను ఎప్పుడూ చూడలేదని.. ప్రశ్నిస్తే తమపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. గ్రామంలో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోవాలని కోరుతున్నారు.

బేస్‌మెంట్‌కు జరుగుతున్న పనులు

దుకాణాల నిర్మాణాలకు పునాదులు తీస్తున్న జేసీబీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement