జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Aug 23 2026 12:10 AM | Updated on Aug 23 2026 12:10 AM

వెంకటాచలం: రాష్ట్రాభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత పేర్కొన్నారు. గొలగమూడిలోని వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఆశ్రమాన్ని శనివారం ఆమె సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నడిపించారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక అభివృద్ధి, సంక్షేమం కుంటుపడ్డాయని మండిపడ్డారు. వెంకయ్యస్వామి ఆశీస్సులతో జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం కావాలని కాంక్షించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, వైస్‌ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ కొణిదెన మోహన్‌నాయుడు, ఎంపీటీసీ వడ్లమూడి ప్రభావతి, నేతలు కొణిదెన విజయభాస్కర్‌నాయుడు, వెలిబోయిన వెంకటేశ్వర్లు, నాగేంద్ర, శ్రీధర్‌నాయుడు, దాసరి భాస్కర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement