అశ్వవాహనంపై ఊరేగిన వెంకయ్యస్వామి | - | Sakshi
Sakshi News home page

అశ్వవాహనంపై ఊరేగిన వెంకయ్యస్వామి

Aug 23 2026 12:10 AM | Updated on Aug 23 2026 12:10 AM

వెంకటాచలం: గొలగమూడిలోని భగవాన్‌ వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా అశ్వవాహనసేవను శనివారం నిర్వహించారు. నిత్య పూజల అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై కొలువుదీర్చి పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం చుట్టూ ఊరేగించి, ట్రాక్టర్‌పై ప్రతిష్టించి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ సాగింది. మహిళల కోలాట ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అన్నసంతర్పణను మధ్యాహ్నం చేపట్టారు. ఉభయకర్తలుగా నెల్లూరుకు చెందిన శ్రీధర్‌, అరుణమ్మ దంపతులు వ్యవహరించారు.

● పెద శేషవాహనసేవను రాత్రి నిర్వహించారు. గొలగమూడి వీధుల్లో ఉత్సవం వేడుకగా సాగింది. ఉభయకర్తలుగా ముత్తుకూరుకు చెందిన ఈదూరు రామ్మోహన్‌రెడ్డి, సుప్రియ.. ఈదూరు రామ్‌ప్రదీప్‌రెడ్డి, లక్ష్మీ శర్వాణి దంపతులు వ్యవహరించారు.

● ఆరాధనోత్సవాల్లో భాగంగా సింహవాహన, గరుడవాహన సేవలను ఆదివారం నిర్వహించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను రాత్రి ప్రదర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement