వెంకటాచలం పీఎస్‌లో ఎస్పీ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

వెంకటాచలం పీఎస్‌లో ఎస్పీ తనిఖీ

Aug 19 2026 12:00 AM | Updated on Aug 19 2026 12:00 AM

వెంకటాచలం: వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అజిత వేజెండ్ల మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ఇండెక్స్‌, మిస్సింగ్‌ కేసులు, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు పురోగతి, స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసులను, పీజీఆర్‌ఎస్‌ పిటిషన్స్‌ నిర్దేశిత గడువులోపు నాణ్యమైన దర్యాప్తు, విచారణతో పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, బ్లాక్‌ స్పాట్‌లలో సీసీటీవీ కవరేజీని విస్తరించాలని సూచించారు. హైవేపై నిరంతర గస్తీ, పెట్రోలింగ్‌, వాహన తనిఖీలు, ట్రాఫిక్‌ నియంత్రణ చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీల్లో నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సీఐ సురేంద్రబాబు, ఎస్సై అంజనేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement