మూడు టన్నుల చికెన్‌ వ్యర్థాల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

మూడు టన్నుల చికెన్‌ వ్యర్థాల స్వాధీనం

Aug 7 2026 12:20 AM | Updated on Aug 7 2026 12:20 AM

మనుబోలు: చేపల గుంతలకు అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల చికెన్‌ వ్యర్థాలను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. ముందస్తుగా అందిన సమాచారంతో కొండూరుసత్రం పవర్‌గ్రిడ్‌ వెనుక ఉన్న చేపల గుంతల వద్ద గురువారం పోలీసులు తనిఖీలు చేశారు. చికెన్‌ వ్యర్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో టాటా ఏస్‌ వాహనాన్ని సీజ్‌ చేశారు. డ్రైవర్‌ పరమాత్మను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బెంగళూరుకు చెందిన బోలే పరమాత్మ తన టాటా ఏస్‌ వాహనంలో చికెన్‌ వేస్ట్‌ను చేపల గుంతలకు సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

కండలేరులో

24.54 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 24.54 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్‌ కాలువకు 10, హైలెవల్‌ కాలువకు 90, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement