నెల్లూరు(బృందావనం): పురుషుల సంప్రదాయ దుస్తుల ప్రముఖ బ్రాండ్ అయిన ‘మినిస్టర్ వైట్’ స్టోర్‌ను నెల్లూరులోని గాంధీబొమ్మ వద్ద ఏర్పాటు చేశారు. దేశంలో 67వ, రాష్ట్రంలో 10వ స్టోర్‌ను చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (సీబీఓ) సురేష్, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన వస్త్రాలను ఒకేచోట అందించాలన్న లక్ష్యంతో మినిస్టర్ వైట్ స్టోర్‌ను నెల్లూరులో ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. సురేష్ మాట్లాడుతూ మినిస్టర్ వైట్ విస్త్రత శ్రేణిలో ధోతీలు, షర్టులు, పెళ్లి దుస్తులు తదితరాలను అందిస్తుందన్నారు. వివాహాలు, పండగలు, ప్రత్యేక సందర్భాల కోసం వినియోగదారులకు పూర్తిస్థాయి షాపింగ్ గమ్యస్థానాన్ని అందించాలన్న సంకల్పంతో నెల్లూరులో స్టోర్ ఏర్పాటు చేశామన్నారు.


