అనారోగ్యం తాళలేక వృద్ధుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యం తాళలేక వృద్ధుడి ఆత్మహత్య

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

కావలిరూరల్‌: అనారోగ్యం తాళలేక పొట్లూరు సింహాద్రి (67) అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కావలి మండలం చెన్నాయ పాళెం ఎస్సీ కాలనీలో జరిగింది. ఆదివారం పోలీసులు వివరాలు వెల్లడించారు. సింహాద్రి గతంలో కూలీ పనులు చేసేవాడు. భార్య ఆదిలక్ష్మి, ముగ్గురు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు. మగపిల్లలకు వివాహం కాలేదు. కాగా సింహాద్రి సుమారు పది సంవత్సరాల నుంచి నడుము నొప్పితో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదిలక్ష్మి ఇంట్లో ఖర్చులకు, భర్త మందుల కోసం రుద్రకోట గ్రామ సమీపంలోని ఓ ధాబాలో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం సింహాద్రి విష గుళికలు తిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిలక్ష్మి కావలి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement