ఆర్టీసీపై ప్రభుత్వ తీరు సమంజసం కాదు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీపై ప్రభుత్వ తీరు సమంజసం కాదు

Jul 8 2026 12:27 AM | Updated on Jul 8 2026 12:27 AM

డిపో 1 ఎదుట జేఏసీ నిరసన

నెల్లూరు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఆ ర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేయడం సమంజసం కాదని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకుడు మురళీమోహన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని డిపో 1 ఎదుట మంగళవారం ఉద్యోగులు, సిబ్బంది ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ బస్సుల పేరుతో ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాలను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయడం దారుణమన్నారు. ఆ బస్సులు ఆర్టీసీ సిబ్బందితోనే నడిపించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళన ప్రారంభించి బుధవారానికి 150 రోజులవుతుందన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మహాలక్ష్మి, ఓవీ ప్రసాద్‌, జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement