నెల్లూరు(అర్బన్): స్వర్ణాంధ్ర – 2047 విజన్‌లో భాగంగా లక్ష్యాల సాధనపై అధికారులకు మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎమిరిటస్ ప్రొఫెసర్ బండి కామయ్య హాజరై శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంచనా విధానాల గురించి అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలు 16వ తేదీ వరకు వివిధ స్థాయిల్లో కొనసాగుతాయని తెలిపారు. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ లక్ష్మీనరసింహులు, స్టాటిస్టికల్ ఆఫీసర్ శ్యామ్‌కుమార్ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రతినిధులు సౌరభ్, లీలారాణి, రవీంద్ర, సచిన్, శిరీష, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


