● ఆందోళనలో తీగపాళెం గ్రామస్తులు
చిల్లకూరు: క్రిస్‌సిటీ ఏర్పాటులో భాగంగా తీర ప్రాంతంలోని తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో భూములను సేకరించారు. వాటికి దగ్గరగా తీగపాళెం అనే గ్రామం ఉంది. దీనికి చుట్టూ 15 ఎకరాల భూమిని భవిష్యత్ అవసరాల కోసం అలాగే వదిలేశారు. ఇటీవల ఆ భూమిని సేకరించేందుకు ఏపీఐఐసీ ప్రయత్నించింది. కొలతలు వేశారు. అయితే దీనిని గ్రామస్తులు అడ్డుకున్నారు. మరోసారి సోమవారం అధికారులు గ్రామానికి వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సేకరించాలనే విషయాలను చర్చించి వెళ్లిపోయారు. తమకు ఎలాంటి సమాచారం అందజేయకుండా అధికారులు పర్యటించడంపై స్థానికులు ఆందోన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులతో కలిసి వస్తే తమకు భరోసా ఉంటుందని అలా కాకుండా ఎవరికి వారుగా పర్యటించి సర్వేలు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.


