● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(పొగతోట): బాబూ జగ్జీవన్‌రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమసమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన మహోన్నత నాయకుడని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, దేశ ఉప ప్రధానిగా, సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా సేవలందించిన జగ్జీవన్‌రామ్ వర్ధంతిని సోమవారం నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ వెనుకబడిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆయన జీవిత ప్రస్థానం భావితరాలకు స్ఫూర్తి అన్నారు. నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.


